Breaking News
Home / States / Andhra Pradesh / ఏపీ :సీజ్ చేసిన లిక్కర్ తో స్టేషన్ లో పార్టీ..!

ఏపీ :సీజ్ చేసిన లిక్కర్ తో స్టేషన్ లో పార్టీ..!

ఏపీలో ఇద్దరు కానిస్టేబుల్ లు పోలీస్ స్టేషన్ లో మందు కొడుతూ అడ్డంగా దొరికిపోయారు. ఈ ఘటన హిందూపురంలో చోటుచేసుకుంది. హిందూపురం పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుళ్లు నూర్‌ మహ్మద్, తిరుమలేశ్ దర్జాగా కూర్చొని మద్యం సేవించారు. ఇటీవల ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు కర్ణాటక నుండి వచ్చిన అక్రమ మద్యాన్ని సీజ్ చేసి పోలీస్ స్టేషన్ లో పెట్టారు. ఆ మద్యం బాటిళ్లను చూసిన తరవాత ఖాకీల నాలుక లాగిందో ఏమో పోలీస్ స్టేషన్ అన్న విషయం కూడా మర్చిపోయి తాగేశారు. తాజాగా దానికి సంబంధించిన వీడియో భయటికి రావటంతో విషయం భయట పడింది. ఇక ఈ ఘటనపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.

Check Also

నరసరావుపేటలో రేపటి నుంచి సంపూర్ణ లాక్‌డౌన్

Share this on WhatsAppనరసరావుపేట: గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో శనివారం నుంచి సంపూర్ణ లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నట్లు ఆర్డీవో ఎం.వెంకటేశ్వర్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *