Breaking News
Home / States / Andhra Pradesh / పవన్‌ కల్యాణ్‌ తెనాలి పర్యటనలో అపశ్రుతి

పవన్‌ కల్యాణ్‌ తెనాలి పర్యటనలో అపశ్రుతి

బైకు ర్యాలీలో కాలు విరిగిన జన సైనికుడు
పెదవడ్లపూడి/గుంటూరు: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తెనాలి పర్యటన సందర్భంగా జరిగిన ద్విచక్రవాహన ర్యాలీలో అపశ్రుతి చోటు చేసుకుంది. దుగ్గిరాల మండలం పేరకలపూడి గ్రామానికి చెందిన ఎ.వినయ్‌కుమార్‌ తోటి కార్యకర్తలతో కలిసి ద్విచక్రవాహన ర్యాలీలో వస్తుండగా పెదవడ్లపూడి ఫైఓవర్‌ బ్రిడ్డి వద్దకు రాగానే అదుపుతప్పి పడిపోయాడు.

ర్యాలీలో పాల్గొన్న మరో కార్యకర్త బైకు వినయ్‌కుమార్‌ కాలిపై వెళ్లడంతో కాలు విరిగి ఎముక సైతం బయటికి వచ్చింది. క్షతగాత్రుడిని వెంటనే చినకాకాని ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం నిమిత్తం విజయవాడ ఎంజెనాయుడు ఆసుప్రతికి తర లించారు. వినయ్‌కుమార్‌ పెయింటింగ్‌ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. అతడి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనని, శస్త్రచికిత్స కోసం జనసైనికులు ఆర్థిక సహాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

Check Also

ధర్నా చౌక్‌కు చేరుకున్న చంద్రబాబు…

Share this on WhatsAppవిజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబు గురువారం ఇసుక దీక్ష నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *