Breaking News
Home / Politics / పవన్ పొగిడింది.. అందుకేనా?

పవన్ పొగిడింది.. అందుకేనా?

రాజకీయాలు:ఏపీ రాజకీయాల్లో చతుర్ముఖ పోటీ నెలకొంది. రాజకీయాల్లో ఎదగడానికి పవన్ తాపత్రయపడుతున్నాడు. బీజేపీతో సావాసం కోసం టీడీపీ తాపత్రయపడుతోంది. బలమైన బీజేపీతో వైసీపీ సన్నిహితంగా ఉండేందుకు ప్రయత్నిస్తోంది. ఏపీ రాజకీయాల్లో ఎదగాలని బీజేపీ చూస్తోంది.బీజేపీకి, జనసేనకు మాత్రం తగినంత బలం లేదు.ఏపీ రాజకీయాల్లో నెగ్గుకురావాలన్న వీరిద్దరి కల నెరవేరాలంటే ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకోవాలని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.బీజేపీ నాయకులు కూడా జగన్ పై విమర్శలు చేస్తూనే ఉన్నారు. పరిస్థితుల దృష్ట్యా ఇరు పార్టీలు కలిస్తే.. అనే ఆలోచన రాజకీయ వర్గాల్లో ప్రస్తావనకొస్తోందని సమాచారం. రీసెంట్ గా పవన్ మాట్లాడుతూ అమిత్ షా వంటి బలమైన నాయకుడు దేశానికి అవసరం అనేశాడు. దీంతో జనసేన-వైసీపీ దోస్తీపై ఊహాగానాలు పెరిగిపోయాయి.ఇదే జరిగితే బీజేపీ అండ జనసేనకు ఉంటుంది.. జనసేన బలం బీజేపీకి తోడవుతుంది. దీంతో టీడీపీని రానివ్వకుండా బీజేపీకి అవకాశం చిక్కుతుంది. వైసీపీపై పైచేయి సాధించేందుకు జనసేనకు అవకాశం దక్కుతుంది. తెర వెనుక ప్రస్తుతం ఇవే పరిణామాలు జరుగుతున్నాయనేది ఓ వాదన. మరి రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో తెలీదు అనే మాటకు ఈ వార్తలు బలం చేకూరుస్తున్నాయనే చెప్పాలి.

Check Also

వైసీపీలో చేరిన మాజీ మంత్రి శిద్దా

Share this on WhatsAppప్రకాశం జిల్లాలో తెలుగు దేశం పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. టీడీపీ మాజీ మంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *