ఫిల్మ్ న్యూస్: పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ నటించిన 25వ చిత్రం `అజ్ఞాతవాసి`. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం గత ఏడాది సంక్రాంతికి విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద తొలి రోజు మంచి కలెక్షన్స్‌ను సాధించినా డిజాస్టర్ సినిమాగానే మిగిలింది. బాక్సాఫీస్ వద్ద రాణించలేకపోయిన ఈ చిత్రం యూ ట్యూబ్‌లో మాత్రం సెన్సేషన్‌ను క్రియేట్ చేసిందట. ఈ చిత్రాన్ని `ఎవడు 3` పేరుతో హిందీలోకి అనువాదం చేసి యూట్యూబ్‌లో విడుదల చేశారట. ఈ సినిమా ఇప్పటికీ 100 మిలియన్ వ్యూస్‌ను దక్కించుకుని ఓ రికార్డ్‌ను క్రియేట్ చేసిందట. ఈ చిత్రంలో కీర్తి సురేశ్, అను ఇమ్మాన్యుయల్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.
