అమరావతి: రాజధాని అమరావతి భవితవ్యంపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ముందే హెచ్చరించారు. ఈ ప్రసంగం ఇప్పుడు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ప్రభుత్వ బాధ్యత గుర్తుచేస్తూ, రైతుల కష్టాలను వివరిస్తూ ఆయన మాట్లాడారు. ‘చంద్రబాబును నమ్మి ప్రభుత్వానికి భూములు ఇస్తున్నారు. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాకపోతే రైతుల పరిస్థితి ఏంటి?. అధికారిక ధ్రువీకరణ పత్రం లేకపోతే రైతులకు నష్టం జరుగుతుంది. అధికారిక పత్రాలు, శాసనాల ద్వారా జరిగితేనే.. రైతులు ఇబ్బంది పడుకుండా ఉంటారని నాటి ప్రసంగంలో’ పవన్ ప్రశ్నించారు.
