కోడంబాక్కం: ‘తొట్టా సినుంగి’, ‘స్వర్ణముఖి’ వంటి వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న దర్శకుడు కేఎస్ అదియమాన్. ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త చిత్రం ‘ఏంజెల్’. ఉదయనిధి హీరోగా నటిస్తుండగా ఆయనకు జోడీగా పాయల్ రాజ్పుత్ ఆడి పాడుతోంది. ఈ సినిమా గురించి ఆమె మాట్లాడుతూ ‘ఇది ఓ వైవిధ్యమైన ప్రేమ కథా చిత్రం. మరణం తర్వాత కూడా ప్రేమ కొనసాగుతుందన్నదే చిత్ర కథ. భావోద్వేగంతో కథ నడుస్తుంది. దర్శకుడి ప్రతిభను చాటే చిత్రమని చెప్పొచ్ఛు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’నని పేర్కొన్నారు.
