Breaking News
Home / States / Andhra Pradesh / Anantapur / సభ వద్ద తోపులాట…ఆగ్రహించిన కార్యకర్తలు…

సభ వద్ద తోపులాట…ఆగ్రహించిన కార్యకర్తలు…

అనంతపురం: వైస్సార్ కంటివెలుగు పథకం ప్రారంభోత్సవం సందర్భంగా గురువారం అనంతపురం జిల్లాలో ఏపీ సీఎం జగన్‌ పర్యటించారు. ఈ నేపథ్యంలో నగరంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో సీఎం బహిరంగ సభ ఏర్పాటు చేశారు. జగన్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా అనంతపురం రావడంతో వైకాపా శ్రేణులు, పట్టణ ప్రజలు భారీగా తరలివచ్చారు. బహిరంగ సభ వేదిక వద్ద స్థలం చాలకపోవడంతో పోలీసులు కొందరిని అడ్డుకుని సభాప్రాంగణం బయటే నిలిపివేశారు. దీనితో తోపులాట జరిగి ఆగ్రహించిన కార్యకర్తలు కుర్చీలు విసిరేసి, టెంట్‌ పీకేయడంతో చాలా మంది వృద్ధులు కింద పడిపోయారు. సభా ప్రాంగణంలో ఏర్పాట్లు సరిగా లేకపోవడంతో ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *