Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / సంక్షోభంలోనే చంద్రబాబు గుర్తొస్తారు: గల్లా

సంక్షోభంలోనే చంద్రబాబు గుర్తొస్తారు: గల్లా

అమరావతి: సంక్షోభం సమయంలోనే ప్రజలకు చంద్రబాబు గుర్తొస్తున్నారని ఎంపీ గల్లా జయదేవ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. సాఫీగా ఉన్న సమయాల్లో ప్రజలు వేరేవారి పార్టీ వైపు చూస్తున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు అవసరం ఈ రాష్ట్రానికి ఉందన్నారు. ఆ విషయం త్వరలోనే ప్రజలకు తెలుస్తుందని చెప్పారు. టీడీపీ ఓటమికి చాలా కారణాలున్నాయని పేర్కొన్నారు. అవిశ్వాస తీర్మానం పెట్టి కేంద్రాన్ని ఎదిరించినవారిలో కేశినేని నాని ప్రథముడు అని తెలిపారు. నాని హర్ట్‌ అయ్యారని అనిపిస్తోందన్నారు. నాని టీడీపీని వీడరని.. పార్టీలోనే కొనసాగుతారని స్పష్టం చేశారు.

Check Also

65 ఏళ్ల మహిళలను టార్గెట్‌గా చేసిన ఇద్దరు చైన్ స్నాచర్ల అరెస్ట్…

Share this on WhatsAppపశ్చిమ గోదావరి: మహిళల మెడలోని బంగారాన్ని లాక్కొని వెళ్లిపోతున్న దొంగలను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. ఉభయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *