Breaking News
Home / States / Andhra Pradesh / ఆయన సూచించిన మార్గాన్ని ప్రజలు ఆచరించాలి…

ఆయన సూచించిన మార్గాన్ని ప్రజలు ఆచరించాలి…

కర్నూలు: మహాత్మాగాంధీ చెప్పిన సిద్ధాంతాలను ఆచరించడమే తన లక్ష్యమని మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ అన్నారు. కర్నూలులో బీజేపీ రాయలసీమ జిల్లా నేతల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఈ నెల 15 నుంచి సంకల్ప యాత్రను ప్రారంభించాలని బీజేపీ నిర్ణయించింది. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ… ప్లాస్టిక్ వ్యర్థాలపై ప్రజల్లో అవగాహన తెచ్చేందుకు ఈ యాత్ర దోహదం చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం పెట్టిన సంక్షేమ పథకాలపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గాంధీజీ సూచించిన మార్గాన్ని ప్రజలు ఆచరించే విధంగా చేయడమే ఈ యాత్ర ముఖ్య ఉద్దేశమని, పేదరికాన్ని నిర్మూలించడం, అట్టడుగున ఉన్న సామాజికవర్గాలను పైకి తీసుకురావడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *