కావలసినవి:
పెసరపప్పు – 1 కప్పు, వేడి నీళ్లు – 2 కప్పులు, నెయ్యి – 4 టేబుల్ స్పూన్లు, కిస్మిస్ – 2 టీ స్పూన్లు, బాదం తరుగు – 2 టీ స్పూన్లు, జీడిపప్పు తరుగు – ఒకటిన్నర టీ స్పూన్లు, నీళ్లు – పావు కప్పు, చిక్కటి పాలు – ముప్పావు కప్పు, పంచదార – అర కప్పు, ఏలకుల పొడి – చిటికెడు, కుంకుమ పువ్వు – పావు టీ స్పూన్ + పాలు – 3 టేబుల్ స్పూన్లు(కలిపి పక్కన పెట్టుకోవాలి)
తయారీ:
ముందుగా వేడి నీళ్లలో 2 గంటల పాటు పెసరపప్పు నానబెట్టాలి. తర్వాత మిక్సీ పట్టుకుని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పాత్ర పెట్టుకోవాలి. పాత్రలో నెయ్యి వేసుకుని వేడి కాగానే.. కిస్మిస్, బాదం తరుగు, జీడిపప్పు తరుగు వేసుకుని దోరగా వేయించి, తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ నెయ్యిలో పెసరపప్పు పేస్ట్ వేసుకుని గరిటెతో తిప్పుతూ ఉండాలి. దగ్గర పడగానే.. నీళ్లు, ఆ తర్వాత పాలు వేసుకుని తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు పంచదార కూడా వేసుకుని మరోసారి బాగా తిప్పాలి. తర్వాత ఐదు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. చివరిగా ఏలకుల పొడి, కుంకుమ పాలు వేసుకుని బాగా కలిపి స్టవ్ ఆప్ చేసుకోవాలి. సర్వ్ చేసుకునే ముందు కిస్మిస్, బాదం తరుగు, జీడిపప్పు తరుగుతో పాటు నచ్చిన ఢ్రైఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుని తింటే హల్వా చాలా రుచిగా ఉంటుంది.