Breaking News
Home / States / బస్సుల టెండర్లను సవాల్‌ చేస్తూ పిటిషన్‌….

బస్సుల టెండర్లను సవాల్‌ చేస్తూ పిటిషన్‌….

హైదరాబాద్: ఆర్టీసీ బస్సుల టెండర్లను సవాల్‌ చేస్తూ హైకోర్టులో ఆర్టీసీ కార్మిక సంఘ్‌ పిటిషన్‌ వేసింది. ఆర్టీసీ బోర్డుకి లేకుండా ఎండీ టెండర్లను పిలవడం చట్ట విరుద్ధమని పిటిషనర్‌ పేర్కొన్నారు. సమ్మెపై ఏ విషయం తేల్చకుండా శాశ్వత ప్రాతిపదికన అద్దె బస్సులు తీసుకుంటున్నారని పిటిషనర్ తెలిపారు.

ఆర్టీసీ తరపున వాదనలను అడిషనల్ అడ్వకేట్ జనరల్ వినిపిస్తూ ఆర్టీసీ సొంత బస్సులు నడిపే పరిస్థితుల్లో లేదని కోర్టుకు తెలిపారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రత్యమ్నాయ ఏర్పాట్లను చేయాలన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు అద్దె బస్సులు తీసుకుంటున్నామని ఆర్టీసీ తెలిపింది. ఆర్టీసీపై ఇప్పటి వరకు దాఖలై పెండింగ్‌లో ఉన్న పిటిషన్లపై ఈ నెల 28న వాదనలను హైకోర్టు విననుంది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *