Breaking News
Home / National / ట్రిపుల్ తలాక్ పై సుప్రీంకోర్టులో పిటిషన్…

ట్రిపుల్ తలాక్ పై సుప్రీంకోర్టులో పిటిషన్…

న్యూఢిల్లీ: ముస్లిం మహిళల (వివాహ హక్కుల పరిరక్షణ) చట్టం-2019ను సవాల్ చేస్తూ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ట్రిపుల్ తలాక్‌ను నేరంగా పరిగణించే ఈ చట్టాన్ని కేంద్రం మూడు నెలల క్రితం అమల్లోకి తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. దీన్ని రద్దు చేయాలంటూ తాజాగా ముస్లిం లా బోర్డు సుప్రీంకోర్టుకు విన్నవించింది.

ట్రిపుల్ తలాక్ నిషేధ చట్టం రద్దు కోసం చట్టపరమైన పోరాటం చేస్తామంటూ ముస్లిం బోర్డు ప్రకటించింది. అధికార బీజేపీ పార్లమెంటు ఉభయ సభల్లో పట్టుబట్టి ఆమోదింపజేసుకున్న ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమంటూ ప్రతిపక్షాలు కూడా విమర్శించాయి. ఇది సమానత్వ హక్కును ఉల్లంఘిస్తోందనీ విమర్శకులు ఆరోపిస్తున్నారు. చట్ట విరుద్ధంగా విడాకులిచ్చిన ఇతర మతాల వారికి ఒక్క ఏడాది మాత్రమే జైలు శిక్ష ఉండగా.. ట్రిపుల్ తలాక్‌తో విడాకులిచ్చిన ముస్లిం వ్యక్తికి మూడేళ్లు ఎలా శిక్ష విధిస్తారని ప్రశ్నిస్తున్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *