Breaking News
Home / National / పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు….

పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు….

వియన్నా : చమురు ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. చమురు ఉత్పత్తి చేసే దేశాల కూటమి ఒపెక్‌ దేశాలు రోజుకు 5 లక్షల బ్యారెల్ల క్రూడాయిల్‌ ఉత్పత్తిని తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. వచ్చే నెల ఒకటి నుంచి ఈ నిర్ణయం అమలులోకి రానుండటంతో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్‌ ధరలు భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వియన్నాలో రష్యాతోపాటు ఒపెక్‌ దేశాల కూటమి సమావేశమై ఈ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో రోజువారి ఉత్పత్తి 17 లక్షల బ్యారెల్లకు పడిపోనుంది.  సమృద్ధిగా చమురు నిల్వలు ఉండటం, ప్రపంచ దేశాలు ఆర్థిక మాంద్యం గుప్పిట్లో ఉన్న నేపథ్యంలో ఒపెక్‌ దేశాలు చమురు ఉత్పత్తిని తగ్గిస్తున్నట్లు ప్రకటించడంతో ధరలపై ఒత్తిడి పెరుగనుంది.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *