హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్లాస్టిక్‌ను నిషేధిస్తూ తీసుకున్న నిర్ణయంపై సీఎం కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీనిపై విధివిధానాలు ఖరారు చేయాలని సూచించారు. మంత్రివర్గ భేటీలో ప్లాస్టిక్ నిషేధంపై చర్చించి ఉత్తర్వులు జారీ చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు.
