Breaking News
Home / States / Andhra Pradesh / శ్రీకాకుళంలో ప్లాస్టిక్ నిర్మూలనకు భారీ ర్యాలీ….

శ్రీకాకుళంలో ప్లాస్టిక్ నిర్మూలనకు భారీ ర్యాలీ….

శ్రీకాకుళం: సంతబొమ్మాళిలో సంతబొమ్మాళి యూత్, మండల పరిషత్ ఆదర్శ ప్రాధమిక పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆధ్వర్యంలో ప్లాస్టిక్ ను వాడొద్దని, బహిరంగంగా మలవిసర్జన చేయరాదని, మరుగుదొడ్లునే వాడాలని, ఆరు బయట చెత్తను వేయొద్దని అంటూ నినాదిస్తూ భారీ ర్యాలీని నిర్వహించారు. ముందుగా పాఠశాలలో ప్రధానోపాధ్యాలు యస్.అప్పలరాజు, యూత్ ప్రధాన బాధ్యులు కూచెట్టి భానుప్రకాష్, అట్టాడ సాయికుమార్ విధ్యార్ధులకు ప్లాస్టిక్ వినియోగం వలన కలిగే అనర్ధాలు వివరించారు. అనంతరం గ్రామంలో ర్యాలీని నిర్వహించి, బస్టాండ్ ఆవరణంలో మానవహారాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో సంతబొమ్మాళి యువత ప్రతినిధులు కూచెట్టి భానుప్రకాష్, అట్టాడ సాయికుమార్, వరప్రసాద్, రాము, తరుణ్, మన్మధ, వెంకటరమణ, గణేష పాల్గొన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *