Breaking News
Home / National / త్వరలో సౌదీలో పర్యటించనున్న ప్రధాని….

త్వరలో సౌదీలో పర్యటించనున్న ప్రధాని….

ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ త్వరలో సౌదీఅరేబియాలో పర్యటించనున్నారు. వార్షిక పెట్టుబడుల సదస్సు నిమిత్తం అక్టోబరు 29న మోదీ సౌదీ వెళ్లనున్నట్లు అధికారిక వర్గాలు తాజాగా వెల్లడించాయి. సౌదీ అరేబియాలో అక్టోబరు 29 నుంచి 31 వరకు జరగనున్న ఫ్యూచర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఇనీషియేటివ్‌(ఎఫ్‌ఐఐ) వార్షిక సదస్సులో పాల్గొనేందుకు మోదీ వెళ్లనున్నారు. ఒక రోజు పాటు సాగనున్న ఈ పర్యటనలో పలు ద్వైపాక్షిక అంశాలపై ఇరు దేశాధినేతల మధ్యచర్చలు జరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

ఈ ఏడాది ఫిబ్రవరిలో సౌదీ యువరాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ భారత్‌కు వచ్చారు. ఆ సమయంలో పెట్రో కెమికల్స్‌, మౌలిక సదుపాయాలు, మైనింగ్‌ తదితర రంగాల్లో భారత్‌లో 100 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు సౌదీ యువరాజు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మోదీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *