Breaking News
Home / National / పీఎంసీ బ్యాంకు ఖాతాదారు గుండెపోటుతో మృతి. అకౌంట్‌లో రూ. 90 లక్షలు…..

పీఎంసీ బ్యాంకు ఖాతాదారు గుండెపోటుతో మృతి. అకౌంట్‌లో రూ. 90 లక్షలు…..

ముంబై: పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో-ఆపరేటివ్ బ్యాంకు(పీఎంసీ) స్కాం అనంతరం ఖాతాదారులు తమ డబ్బులు తీసుకునేందుకు పలు అవస్థలు పడుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో తాజాగా మరో ఘటన చోటుచేసుకుంది. ఒక ఖాతాదారు గుండెపోటుతో మృతి చెందాడు. మృతుడిని 51 ఏళ్ల సంజయ్ గులాటీగా పోలీసులు గుర్తించారు. సంజయ్ నిన్న కోర్టు ఎదుట పీఎంసీ ఖాతాదారులు చేపట్టిన ఆందోళనలో పాల్గొన్నాడు. కాగా అతని ఖాతాలో రూ. 90 లక్షల ఉన్నట్లు సమాచారం. ఈ సందర్భంగా సంజయ్ గులాటీ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ సంజయ్‌కు వ్యాపారనిమిత్తం డబ్బుల అవసరం ఉందన్నారు. బ్యాంకులో డబ్బులు ఇవ్వక పోవడంతో చాలాకాలంగా ఆందోళనతో కాలం గడుపుతున్నారని తెలిపారు. పర్యవసానంగానే సంజయ్‌కు గుండెపోటు వచ్చిందని అన్నారు. సంజయ్ మృతికి పీఎంసీనే బాధ్యత వహించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలావుండగా భారతీయ రిజర్వ్ బ్యాంకు… పీఎంసీ ఖాతాదారులకు ఉపశమనం కలిగించింది. పీఎంసీ బ్యాంకు నుంచి ఖాతాదారులు తీసుకునే మొత్తాన్ని 25 వేల నుంచి 40 వేలకు పెంచింది.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *