హైదరాబాద్: తెలంగాణ సర్పంచుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న భూమన్న యాదవ్పై సచివాలయంలో ఉద్యోగాల పేరుతో మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో భూమన్న యాదవ్ ను స్వస్థలమైన నిర్మల్లో పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపర్చారు. న్యాయమూర్తి భూమన్నకు 14 రోజుల రిమాండ్ విధించారు. పలువురి వద్ద డబ్బులు వసూలు చేశారని, బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలు తీసుకున్నారు.
