Breaking News
Home / Crime / శంషాబాద్ చోరి కేసుని ఛేదించిన పోలీసులు…

శంషాబాద్ చోరి కేసుని ఛేదించిన పోలీసులు…

రంగారెడ్డి: శంషాబాద్ లో కన్యకా పరమేశ్వరి దేవాలయం చోరీ కేసుని పోలీసులు ఛేదించారు. దుండగుడు అక్టోబర్ 2వ తేదీన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లోని దేవాలయంలో చోరీకి పాల్పడి టెంపుల్ లో ఉన్న అమ్మవారి ముక్కుపుడక, 2 వెండి కళ్ళను ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. చోరీకి పాల్పడిన ధన్ రాజ్ అనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. శంషాబాద్ సింప్లెక్స్ రోడ్డు వద్ద వాహనాల తనిఖీలో ధనరాజ్ అనే వ్యక్తి బైక్ పై వెళ్తుండగా అతన్ని ఆపి ఫింగర్ ప్రింట్స్ చెక్ చేయగా.. ఫింగర్ ప్రింట్ ఆధారంగా పాత నేరస్తుడిగా గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అతన్ని పూర్తిస్థాయిలో విచారించగా అతనిపై ఐదు కేసులు ఉన్నట్లుగా గుర్తించారు. నిందితుడు ధన్ రాజ్ రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్‌ సురారం ప్రాంతానికి చెందిన వాడిగా గుర్తించారు. నిందితుడి నుండి 130 గ్రాముల బంగారం, రెండు వందల గ్రాముల వెండి పట్టీలు, ఒక పల్సర్‌ బైక్ స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించారు. ధన్ రాజ్ పై పీడియాక్ట్ కూడా నమోదు చేస్తామని శంషాబాద్ ఏసీపీ అశోక్ కుమార్ తెలియజేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *