Breaking News
Home / States / పార్టీకి కొమ్ముకాస్తూ ప్రజలపై ఖాకీల దాడి….

పార్టీకి కొమ్ముకాస్తూ ప్రజలపై ఖాకీల దాడి….

యాదాద్రి: యాదాద్రి జిల్లా పల్లెర్ల గ్రామంలో దుర్గామాతా శోభాయాత్ర నందు పోలీసులు తమ ప్రతాపం చూపిస్తూ రెచ్చిపోయారు. ఆత్మకూర్ మండలం పల్లెర్ల గ్రామంలో దుర్గామాతా శోభాయాత్ర జరుగుతుండగా కుంకుమ పడిందన్న కోపంతో ఆత్మకూర్ ఎస్సై, కానిస్టేబుల్స్‌తో ఓ యువకుడిని చితక్కొట్టించారు. కళ్లముందే కొడుకుని కొడుతుండటంతో అడ్డుకోబోయిన తల్లిని కూడా దూషిస్తూ పోలీసులు చాలా దురుసుగా ప్రవర్తించారు.

ఒక పార్టీకి కొమ్ము కాస్తూ గ్రామంలో భయబ్రాంతులకు గురిచేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమపై దాడి చేస్తున్న వారిపై ఎన్ని ఫిర్యాదులు చేసినా ఆత్మకూర్ ఎస్సై పట్టించుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు. అమాయకులపై ప్రతాపం చూపిస్తూ ప్రజాప్రతినిధులకు కొమ్ముకాస్తున్న ఎస్సైపై చర్యలు తీసుకోవాలని ఆందోళనకు దిగుతామని బాధితులు చెబుతున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *