Breaking News
Home / States / Andhra Pradesh / టీడీపీ అధినేతపై పోలీసులకు ఫిర్యాదు….

టీడీపీ అధినేతపై పోలీసులకు ఫిర్యాదు….

గుంటూరు: పోలీసు వ్యవస్థను కించపరిచేలా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేత వర్ల రామయ్య లు మాట్లాడుతున్నారంటూ గుంటూరు జిల్లా అరండల్ పేట పోలీసు స్టేషన్లో వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, విడదల రజని, మహ్మద్ ముస్తఫా తదితరులు ఫిర్యాదు చేశారు. చంద్రబాబు, వర్ల రామయ్య పోలీసుల ఆత్మా స్థైర్యాన్ని దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని, డీజీపీపైనా నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు తన తప్పులను సమర్ధించుకోకుండా సరిదిద్దుకోవాలని హితవు పలికారు. వారిరువురిని తక్షణం అరెస్ట్ చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు ఆ స్థాయికి తగ్గట్లుగా మాట్లాడటం లేదన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *