Breaking News
Home / National / కన్నబిడ్డలను మరిపిస్తున్న పోలీసులు

కన్నబిడ్డలను మరిపిస్తున్న పోలీసులు

ఇండోర్: సాధారణంగా పోలీసులు దొంగలను పట్టుకోవడం, శాంతి భద్రతలను కాపాడటంలాంటి పనులు చేస్తారనుకుంటాం. అయితే వారు వృద్ధులను సంరక్షించే పని కూడా చేస్తున్నారు. వారికి సమయానికి మందులివ్వడం, అవసరమైనపుడు ఆసుత్రికి తీసుకువెళ్లడం మొదలైన పనులను నిర్వర్తిస్తున్నారు. ఈ కార్యక్రమాలన్నీ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ పోలీసు విభాగానికి చెందిన ‘సీనియర్ సిటిజన్ పోలీస్ పంచాయతీ’ చేపడుతోంది. కొన్నేళ్ల క్రితం ఇక్కడి పోలీసు విభాగం వృద్దులకు చేయూత నందించాలని నిర్ణయించుకొని, దానిని అమలు చేస్తోంది. ఎఎస్పీ ప్రశాంత్ చౌబే తెలిపిన వివరాల ప్రకారం ఈ కార్యక్రమం ప్రారంభించిన కొత్తలో వృద్ధులకు ఐకార్డులు పంపిణీ చేశారు. వాటిపై వారి ఫొటో జతచేసి, వారి వివరాలన్నింటినీ నమోదు చేయడంతో పాటు పోలీసు కంట్రోల్ రూం నెంబరు కూడా ముద్రించారు. ఇప్పటివరకూ ఇండోర్ పరిధిలో మొత్తం 25 వేలమంది వృద్ధులకు ఇటువంటి కార్డులు జారీ చేశారు. ఈ కార్డుతో వారికి పలు ప్రయోజనాలు కూడా కల్పిస్తున్నారు. ఈ సీనియర్ సిటిజన్ కార్డు చూపించడం ద్వారా స్థానికంగా వారికి పలు సందర్భాల్లో సాయం లభిస్తోంది. నడవలేని స్థితిలో ఉన్నవారికి వీల్ చైర్ సదుపాయం కల్పిస్తున్నారు. అలాగే మందులు మొదలు కొని ఆసుపత్రి ఖర్చులవరకూ వారికి డిస్కౌంట్ అందజేస్తున్నారు. నిత్యావసర సరుకులు కొనుగోలు చేసేటప్పుడు సైతం వృద్ధులకు రాయితీ అందిస్తున్నారు. దీనికితోడు పోలీసు విభాగం దగ్గర వృద్ధుల డేటా ఉండటంతో నేరుగా పోలీసులే వారి ఇళ్లకువెళ్లి, వారి యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు. పోలీసులు అందినిస్తున్న సేవలను వృద్ధులు ఎంతగానో మెచ్చుకుంటున్నారు.

Check Also

రెస్టారెంట్ పెట్టేందుకు బాలిక కిడ్నాప్… పోలీసుల రాకతో..

Share this on WhatsAppపూణె: సొంతంగా రెస్టారెంట్ ప్రారంభించాలని భావించిన ఇద్దరు వ్యక్తులు 12 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి, …

One comment

  1. Good team work.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *