Breaking News
Home / National / బీజేపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీచార్జి

బీజేపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీచార్జి

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి. కాగా బుధవారం భారతీయ జనతా పార్టీ కార్తకర్తలు చేపట్టిన ఆందోళన హింసాత్మకమైంది. నగరంలోని పోలీసు హెడ్‌క్వార్టర్స్ వద్ద నిరసన చేస్తున్న బీజేపీ కార్యకర్తపై పోలీసులు లాఠీచార్జి చేశారు. అనంతరం టియర్ గాసులు, వాటర్ కెనోన్‌లతో పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు.

బుధవారం చేపట్టిన ఆందోళనలో వందల సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కోల్‌కతాలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు ర్యాలీగా చేరుకున్నారు. అయితే వారిని నిలువరించేందుకు పోలీసులు చాలా ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ వారు ససేమిరా అనడంతో లాఠీచార్జికి దిగారు. బీజేపీ కార్యకర్తలు పోలీసులపై రాళ్లు రువ్వడం ప్రారంభించారు. పరిస్థితులు అదుపుతప్పడంతో టియర్ గ్యాస్ ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టారు. ఈ ప్రయత్నంలో వాటర్ కెనోన్లను కూడా ప్రయోగించారు.

కాగా, రాష్ట్రంలో జరిగిన అల్లర్లలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయలయ్యాయి. ఉత్తర 24 పరగణాల జిల్లాలో బాంబు పేలుడంతో మహ్మద్ ముఖ్తార్, మహ్మద్ హలీం అనే ఇద్దరు వ్యక్తులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో సంబంధం ఉందని అనుమానిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నామని వారు పేర్కొన్నారు. మరణించిన వారు, తీవ్రంగా గాయపడిన వారు తమ పార్టీ సానుభూతిపరులని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తెలిపింది.

Check Also

విక్రమ్ కోసం కొనసాగుతున్న ‘నాసా’ ప్రయత్నాలు….

Share this on WhatsAppబెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) కలల ప్రాజెక్టు చంద్రయాన్‌2కి చెందిన విక్రమ్ ల్యాండర్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *