నాగ్‌పూర్: పలు క్రిమినల్ కేసులున్న గ్యాంగ్‌స్టర్ సంతోష్ అంబేకర్ ఇంట్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. 5 కోట్ల రూపాయల విలువైన ఆస్తి ఒప్పందానికి సంబంధించి గుజరాత్‌కు చెందిన వ్యాపారవేత్తను మోసం చేసినట్లు సంతోష్ అంబేకర్‌పై ఎంసీఓసీ యాక్ట్ కింద కేసు నమోదైంది. ఈ మేరకు పోలీసులు అతని ఇంటిపై దాడులు చేపట్టారు. సంతోష్ అంబేకర్‌పై హత్య కేసు సహా 30 క్రిమినల్ కేసులు నమోదైనట్లు డీసీపీ (క్రైం)గజానన్ రాజ్మనే తెలిపారు. బీఎండబ్ల్యూ కారుతో పాటు పలు వాహనాలు, బైకులను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. గ్యాంగ్‌స్టర్ సంతోష్, అతని అనుచరుల ఇండ్లలో నుంచి రూ.5.50 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
