Breaking News
Home / States / 100కు పెరుగుతున్న స్పందన….?

100కు పెరుగుతున్న స్పందన….?

ఫోన్‌ రాగానే స్పందిస్తున్న పోలీసులు
హైదరాబాద్‌ : దిశ ఘటనలో పోలీసులు సరిగా స్పందించకపోవడంతో ఘోరం జరిగిందన్న ప్రజాగ్రహం ఎన్‌కౌంటర్‌తో చల్లారింది. పోలీసులపై రాళ్లు రువ్విన ప్రజలే, వాళ్లపై పూలు చల్లారు. ఈ ఘటన పోలీసులకు కొత్త గుణపాఠాన్ని నేర్పింది. ఎన్‌కౌంటర్‌పై మిశ్రమ స్పందనలు వస్తున్న సమయంలో ఇలాంటి నేరాలకు పోలీసులు ఏ విధంగా చెక్‌పెడతారో అని నెటిజన్లు ప్రశ్నలు వేస్తున్నారు. దానికి పోలీసులు తమదైన శైలిలో స్పందించి సమాధానమిస్తున్నారు. డయల్‌ 100కు ఫోన్‌ చేసిన వెంటనే స్పందించి వెంటనే సంఘటనాస్థలికి చేరుకుంటున్నారు. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలను గమనించినట్లయితే ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది.

కొన్ని రోజుల క్రితం ఎల్‌బీనగర్‌ ప్రాంతంలో ఓ మహిళ తన ద్విచక్రవాహనంలో పెట్రోల్‌ అయిపోయిందని 100 నంబర్‌కు ఫోన్‌ చేసింది. స్పందించిన పోలీసులు ఆమెకు పెట్రోల్‌ అందించారు. హయత్‌నగర్‌ ప్రాంతంలో యువకుడు అసభ్యకరంగా ప్రవర్తించాడని ఫోన్‌ చేసిన వెంటనే స్పందించిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. దిశ ఘటన అనంతరం ఆపదలో ఉంటే డయల్‌ 100కు ఫోన్‌ చేయమని పోలీసులు విస్తృత ప్రచారం చేపట్టారు. వచ్చిన ప్రతికాల్‌కు సత్వరం స్పందిస్తున్నారు.

జీపీఎస్‌ ఆధారంగా పరిసర ప్రాంతాల్లో విధుల్లో ఉన్న రక్షక్‌, బ్లూకోల్ట్స్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుంటున్నారు. స్మార్ట్‌ఫోన్‌ను వినియోగించే ప్రతి ఒక్కరూ హాక్‌ ఐ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని, ఆపద సమయంలో డయల్‌ 100, 112కు ఫోన్‌ చేయాలని ప్రచారం చేస్తున్నారు. అనుకోని పరిస్థితుల్లో ఎక్కడైనా చిక్కుకుంటే పోలీసుల సహాయం తీసుకోవాలని కోరుతున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *