Breaking News
Home / States / Andhra Pradesh / ప్రజా భద్రత కోసమే పోలీసు వ్యవస్థ…

ప్రజా భద్రత కోసమే పోలీసు వ్యవస్థ…

గుంటూరు : పోలీసులు ఉన్నది ప్రజాసేవ, ప్రజా భద్రత కోసమేనని ఎపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా సాధారణ ప్రజలకు కూడా పోలీసుల గురించి తెలిసిందని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు, పోలీసులకు పోటీలు నిర్వహించామని చెప్పారు. పోలీస్ స్టేషన్ అంటే భయపడే పరిస్థితి ప్రజల్లో ఉండకూడదని అన్నారు. ఇప్పటి వరకూ 1.4 లక్షల మంది విద్యార్థులు పోలీస్ స్టేషన్లను సందర్శించారని అన్నారు. కాగా, పోలీస్ అమరవీరుల వారోత్సవాలు రేపటితో ముగియనున్నాయి.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *