Breaking News
Home / States / కాంగ్రెస్ ఎమ్మెల్యేను అరెస్ట్ చేసిన పోలీసులు…

కాంగ్రెస్ ఎమ్మెల్యేను అరెస్ట్ చేసిన పోలీసులు…

సంగారెడ్డి: రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఇంటిని ముట్టడించేందుకు బయలుదేరిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డిలో కార్మికులతో పాటు కలిసి ఆయన హైదరాబాద్ కు బయలు దేరుతుండగా పోలీసులు అడ్డుపడి.. జగ్గారెడ్డిని అరెస్టు చేశారు. జగ్గారెడ్డి అరెస్టును కాంగ్రెస్ నాయకులు ఖండించారు. కాగా, సంగారెడ్డి ఆర్టీసీ డిపో వద్దకు కార్మికులు, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *