Breaking News
Home / National / నకిలీ షియోమీ ఉత్పత్తులను సీజ్ చేసిన పోలీసులు….

నకిలీ షియోమీ ఉత్పత్తులను సీజ్ చేసిన పోలీసులు….

న్యూఢిల్లీ: మీరు షియోమీ ఉత్పత్తులను వాడుతున్నారా? అయితే ఓసారి వాటిని చెక్ చేసుకోండి. ఎందుకంటే అది నకిలీది కావొచ్చు. తాజాగా ఢిల్లీ పోలీసులు రూ.13 లక్షల విలువైన 2000 వేల నకిలీ షియోమీ ఉత్పత్తులను పట్టుకున్నారు. తమ కంపెనీ పేరుతో నకిలీ ఉత్పత్తులు అమ్ముతున్నారన్న షియోమీ ఫిర్యాదుతో ఢిల్లీ, కరోల్‌బాగ్‌లోని గఫర్ మార్కెట్‌పై పోలీసులు దాడులు చేశారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున నకిలీ ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఆ ఉత్పత్తులను మార్కెట్‌కు సరఫరా చేసే నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. పోలీసులు సీజ్ చేసిన వాటిలో పవర్ బ్యాంకులు, ఇయర్ ఫోన్లు, వైర్‌లెస్ హెడ్‌సెట్లు, ట్రావెల్ అడాప్టర్లు, స్మార్ట్‌ఫోన్ యాక్సెసరీలు ఉన్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *