Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / టీడీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు…

టీడీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు…

అమరావతి: అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజు ప్రారంభమయ్యాయి. పెరిగిన ఉల్లి ధరలకు నిరసనగా టీడీపీ ఆందోళనకు దిగింది. ఉల్లి దండలు మెడలో వేసుకుని ఆ పార్టీ నేతలు నిరసన తెలిపారు. అయితే అసెంబ్లీ ప్రధాన ద్వారం టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. అయితే ప్లకార్డులతో అనుమతి లేదని టీడీపీ అధినేత చంద్రబాబును గేటు వద్దే పోలీసులు ఆపేశారు. చంద్రబాబుతో పాటు ఇతర నేతలను గేటు వద్దే ఆపేశారు. దీంతో పోలీసులు- తెలుగు తమ్ముళ్లకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉల్లిధరలు బంగారంతో సమానంగా ఉన్నాయన్నారు. తక్కెడలో బంగారం, ఉల్లిపాయలు పెట్టి రెండూ సమానమేనని బాబు చూపించారు. ఉల్లి ధరలను ప్రభుత్వం నియంత్రించలేకపోతోందని విమర్శలు గుప్పించారు. టీడీపీ హయాంలో నిత్యావసర ధరలు పెరగకుండా చర్యలు తీసుకున్నామని బాబు చెప్పుకొచ్చారు. సబ్సిడీపై తక్కువ ధరలతో ఉల్లి అందించామన్నారు. ధరలు దిగివచ్చేవరకు టీడీపీ పోరాటం కొనసాగుతుందని చంద్రబాబు తెలిపారు.

 

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *