Breaking News
Home / States / Andhra Pradesh / చంద్రబాబు రుణం తీర్చుకోలేనిది..

చంద్రబాబు రుణం తీర్చుకోలేనిది..

నిమ్మలకు అరుదైన అవకాశం
పశ్చిమ గోదావరి: తెలుగుదేశం శాసనసభ పక్ష ఉప నేతగా పాలకొల్లు ఎమ్మెల్యే డాక్టర్‌ నిమ్మల రామానాయుడును నియమించారు. పార్టీ శాసనసభ పక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ నిర్ణయం తీసుకున్నారు. శాసన సభలో ఉప నేతలుగా అచ్చెన్ననాయుడు, బుచ్చయ్యచౌదరితోపాటు రామానాయుడుకు అవకాశం ఇచ్చారు. ఈసారి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పాలకొల్లులో భారీ మెజార్టీతో గెలుపొందడం, మొదటి నుంచి పార్టీ వ్యవహారాల్లో అత్యంత కీలక పాత్ర పోషించిన కారణంగానే ఆయనకు శాసనసభ పక్ష ఉపనేత అవకాశం దక్కింది.

మొదటి నుంచి విద్యార్థి రాజకీయాల్లో ఆరితేరి, ఆ తదుపరి క్రియా శీలక రాజకీయాల్లో రాణించారు. గడిచిన ఎన్నికల్లోనూ పాలకొల్లు నుంచి తొలిసారిగా గెలుపొందారు. ఇప్పుడు నువ్వా నేనా అన్నట్టుగా సాగిన ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించారు. గెలుపొందిన వారిలో ఇప్పుడు రామానాయుడు జిల్లాలో అత్యంత సీనియర్‌. ‘పార్టీ నాకు అరుదైన అవకాశం ఇచ్చింది. ప్రతిపక్ష హోదాలో నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తా. ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇస్తాం. అభివృద్ధి, సంక్షేమం కోరుకునేవాళ్ళంగా, పక్షపాత రహితంగా వ్యవహరిస్తాం. నా మీద అత్యంత విశ్వాసంతో చంద్రబాబునాయుడు అతి పెద్ద అవకాశం ఇచ్చారు. ఆయన రుణం తీర్చుకోలేనిది’ అని రామానాయుడు వ్యాఖ్యానించారు. శాసనసభా పక్ష టీడీపీ ఉప నేతగా ఇంతకు ముందు కోటగిరి విద్యాధరరావు వ్యవహరించారు. ఆ తరువాత జిల్లాకు ఈ స్థానం దక్కడం ఇదే తొలిసారి. ఈసారి సమావేశాల్లో వీలు చిక్కితే కచ్చితంగా సమస్యల ను లేవనెత్తుతామని, అందుకు వీలుగా అప్రమత్తంగా ఉన్నామని ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు వెల్లడిం చారు. ఆక్వా సమస్యలతోపాటు కాలువ శివారు భూముల కు నీరు, తాగునీటి సమస్య వంటి అనేక కీలక అంశాలను సభ ముందుకు తేవడానికి తాను సిద్ధంగా ఉన్నానని రామరాజు ప్రకటించారు.

Check Also

65 ఏళ్ల మహిళలను టార్గెట్‌గా చేసిన ఇద్దరు చైన్ స్నాచర్ల అరెస్ట్…

Share this on WhatsAppపశ్చిమ గోదావరి: మహిళల మెడలోని బంగారాన్ని లాక్కొని వెళ్లిపోతున్న దొంగలను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. ఉభయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *