Breaking News
Home / States / Andhra Pradesh / పాలిటెక్నిక్‌ విద్యార్థి ఆత్మహత్య

పాలిటెక్నిక్‌ విద్యార్థి ఆత్మహత్య

అమరావతి న్యూస్, టెక్కలి రూరల్‌: మండలంలోని నౌపడ రైల్వే స్టేషన్‌ సమీపంలో సోమవారం పాలిటెక్నిక్‌ విద్యార్థి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. టెక్కలి కొడ్రవీధికి చెందిన కంచుమోజు వంశీ (18) డిప్లమో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. కళాశాలకు వెళతానని చెప్పి నౌపడ ఆర్‌ఎస్‌ రైల్వే స్టేషన్‌కు వెళ్లాడు. ఏ రైలు వస్తుందని అక్కడ ఉన్నవారిని అడిగాడు. హౌరా మెయిల్‌ వస్తుందని చెప్పడంతో కొంత సమయం వేచి ఉన్నాడు. రైలు దగ్గరకు వచ్చే సరికి పట్టాలపైకి దూకి తలపెట్టాడు. అతని పైనుంచి రైలు వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. యూనిఫాం ఆధారంగా కళాశాలకు ఈ విషయం తెలియజేశారు. స్నేహితులు ఘటనా స్థలానికి చేరుకుని మృతి చెందిన వ్యక్తి వంశీగా గుర్తించారు. మృతుని కుటుంబ సభ్యులకు కళాశాల సిబ్బంది సమాచారం చేరవేశారు. ఎందుకు ఇంతటి అఘాయిత్యానికి పాల్పడ్డాడో కారణం తెలియడం లేదని, ఎంతో అల్లారుముద్దుగా పెంచామని తల్లిదండ్రులు మల్లేష్‌, శ్రీదేవి కన్నీరుమున్నీరుగా విలిపించారు. మృతుడికి అన్నయ్య పవన్‌ ఉన్నాడు. కొడ్రవీధిలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *