Breaking News
Home / National / సోషల్ మీడియాలో పోస్ట్ నిందితుడు అరెస్ట్….

సోషల్ మీడియాలో పోస్ట్ నిందితుడు అరెస్ట్….

గౌహతి : సాక్షాత్తూ సీఎంను చంపుతానని బెదిరిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన టీవీ ఛానల్ ఉద్యోగిని పోలీసులు అరెస్టు చేసిన ఘటన అసోంలో జరిగింది. గౌహతి నగరానికి చెందిన మునీరుద్దీన్ రెహమాన్ అసోం టాక్స్ టీవీ ఛానల్ ఉద్యోగి. అసోం రాష్ట్ర ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ ను చంపుతానని మునీరుద్దీన్ రెహమాన్ బెదిరిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. రెహమాన్ సురాజిత్ హర్ష్ పేరిట నకిలీ ఫేస్ బుక్ ఖాతా తెరచి అస్సామీ భాషలో సీఎం సోనోవాల్ ను దూషిస్తూ పోస్టు పెట్టాడు. తన వద్ద గన్ ఉందని, సీఎంను హతమారుస్తానని బెదిరించాడు. దీంతో పోలీసులు రెహమాన్ పై ఐపీసీ 294, 295ఎ, 506, 67 ఐటీ యాక్ట్ ల కింద కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్టు చేశారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *