న్యూఢిల్లీ: ఏపీలో ఈ నెల 20వ తేదీ రాత్రి ఏబీఎన్ ఛానెల్ ప్రసారాలను పునరుద్ధరించామని, జరిమానా వేయొద్దు అంటూ ఏపీ ఫైబర్ నెట్ తరపు న్యాయవాది టీడీశాట్‌కు విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన టీడీశాట్ జరిమానా ఎందుకు విధించకూడదో వివరిస్తూ లిఖితపూర్వకంగా రెండు రోజుల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని ఏపీ ఫైబర్ నెట్‌ను ఆదేశించింది. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేదని, అందుకే జరిమానా విధించవద్దని టీడీశాట్‌కు ఏపీ ఫైబర్ నెట్ తరపు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. తదుపరి విచారణ నవంబర్ 14వ తేదీకి టీడీశాట్ వాయిదా వేసింది.
