Breaking News
Home / hyderabad / ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో విచారణ వాయిదా

ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో విచారణ వాయిదా

హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ హత్యకేసు నిందితుల ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. అయితే ఈ కేసుపై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ జరుపుతున్న నేపథ్యంలో హైకోర్టు విచారణ వాయిదా పడింది. ఇవాళ మధ్యాహ్నం 12.45కి కేసును విచారిస్తామని న్యాయస్థానం వెల్లడించింది. చటాన్‌పల్లి వద్ద ఈ నెల 6న జరిగిన పోలీసు ఎన్‌కౌంటర్‌లో నిందితులు మహమ్మద్‌ ఆరిఫ్‌, జొల్లు నవీన్‌, జొల్లు శివ, సీహెచ్‌ చెన్నకేశవులు నలుగురూ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ మృతదేహాలను 13వ తేదీవరకు భద్రపరచాలని హైకోర్టు ఆదేశించింది.

Check Also

నేటి నుంచి స్వచ్ఛంద లాక్‌డౌన్‌

Share this on WhatsAppఆదిలాబాద్: కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా వాంకిడి మండల కేంద్రంలో గురువారం నుంచి వారం రోజుల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *