Breaking News
Home / States / కార్మికుల జీతాల చెల్లింపుపై విచారణ వాయిదా….

కార్మికుల జీతాల చెల్లింపుపై విచారణ వాయిదా….

హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులకు జీతాలు చెల్లించాలని గత వారం దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు స్పష్టమైన సూచనలు చేసింది. 21వ తేదీ నాటికి జీతాలు చెల్లించాలని ఆర్టీసీ కార్పొరేషన్‌కు ఆదేశించింది. దీనిపై సోమవారం హైకోర్టులో విచారణ జరగగా జీతాల చెల్లింపుకు రూ. 224 కోట్లు కావాలని అయితే ఆర్టీసీ వద్ద రూ. 7.5 కోట్లే ఉన్నాయని అడ్వకేట్ జనరల్ న్యాయస్థానానికి తెలిపారు. దీంతో కార్మికులు ప్రభుత్వ వైఖరిపై మండిపడుతూ నష్టాల సాకుతో ఆర్టీసీని విచ్ఛిన్నం చేయడానికి ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఆరేళ్లుగా రాని సమస్య ఇప్పుడు ఎందుకొచ్చిందని కార్మికులు ప్రశ్నించారు. కోర్టుకు ప్రభుత్వం తప్పుడు సమాచారం ఇస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరువైపు వాదనలు విన్న అనంతరం తదుపరి విచారణను ఈనెల 29వ తేదీకి వాయిదా వేసింది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *