Breaking News
Home / World News / ఇంట్లో ఆలుగడ్డలు.. లాక్‌డౌన్‌ తర్వాత చూస్తే మహిళకు షాక్‌!

ఇంట్లో ఆలుగడ్డలు.. లాక్‌డౌన్‌ తర్వాత చూస్తే మహిళకు షాక్‌!

మార్కెట్‌లో ఆలుగడ్డలు కొనుగోలు చేసి ఇంట్లో తెచ్చి పెట్టేస్తాం. కొన్నిరోజుల తర్వాత కూర వండుదామని చూసేసరికి మొలకలు వచ్చి ఉంటాయి. అలాంటిది లాక్‌డౌన్ అంటే.. మూడు నెలలు.. ఆలుగడ్డలు కాస్త మొక్కలుగా మారి ఉంటాయి. ఈ మహిళ ఇంట్లో కూడా అదే జరిగింది.

ఫ్రాన్స్‌కు చెందిన డన్నా పారీ అనే మహిళ రూ. 210లకు ఆలుగడ్డలు కొని ఇంట్లో పెట్టింది. కరోనా వైరస్ నేపథ్యంలో ఆ దేశంలో లాక్‌డౌన్ ప్రకటించడంతో డన్నా తన ఫ్రెండ్ ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నది. కావాల్సిన వస్తువులన్నీ తీసుకెళ్లింది. కానీ ఆలుగడ్డలను అలానే వదిలేసింది. లాక్‌డౌన్ తర్వాత ఇంటికి చేరుకొని కిచెన్‌లోకి వెళ్లేసరికి డన్నా షాక్‌కు గురైంది. గోడకు మొక్కలు మొలిచాయి. ఒక్క చెట్టు కూడా లేని ఇంట్లోకి మొక్కలు ఎలా వచ్చాయి అని డన్నా ఆలోచిస్తే ఆలుగడ్డలు అన్న సంగతి గుర్తొచ్చింది. వాటిని చూసి తెగ నవ్వుకున్నది. ఈ మొక్కలకు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇప్పుడు ఇవి బాగా వైరల్ అవుతున్నాయి.

Check Also

అంతుచిక్కని మరో వైరస్.. వందలాది మంది మృతి

Share this on WhatsAppతమ పొరుగు దేశం కజకిస్థాన్‌లో అంతుచిక్కని వైరస్‌ కారణంగా వ్యాధులు ప్రబలి, వందలాది మంది మృత్యువాత …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *