Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / అమరావతిపై స్పీడు పెంచుతున్న అధికార, విపక్షాలు

అమరావతిపై స్పీడు పెంచుతున్న అధికార, విపక్షాలు

అమరావతి: మూడు రాజధానుల విషయంలో హైపవర్ కమిటీ శుక్రవారం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో భేటీ కానుంది. ఇప్పటికే మూడుసార్లు హైపవర్ కమిటీ భేటీ అయింది. కమిటీ సభ్యుల అభిప్రాయాలతో శుక్రవారం నివేదికను ఫైనల్ చేసే అవకాశం ఉంది. 20వ తేదీన ప్రత్యేక అసెంబ్లీ నిర్వహించాలని ఇప్పటికే తేదీని ఖరారు చేసినందున శుక్రవారం హైపకమిటీ భేటీ చివరిది కావడం ఖాయంగా కనిపిస్తోంది. అదే సమయంలో రాజధాని రైతులు తమ అభిప్రాయాలు చెప్పుకోవచ్చంటూ ప్రభుత్వం విధించిన గడువు కూడా శుక్రవారంతో ముగియనుంది.

మరోవైపు విపక్ష పార్టీలు అవరావతి పోరాటం విషయంలో స్పీడు పెంచుతుననాయి. గవర్నర్ ను కలిసి వినతి పత్రం ఇవ్వాలని చంద్రబాబు, అమరావతి జేఏసీ నిర్ణయించారు. రాజకీయ దురుద్దేశంతోనే ప్రభుత్వం అమరావతిని దెబ్బ తీస్తోందని చంద్రబాబు, జేఏసీ నేతలు ఆరోపిస్తున్నారు. ఓ వైపు అమరావతిని కాపాడుకుంటామంటూ బీజేపీ, జనసేన కలిసిపోవడం, మరోవైపు రాష్ట్రవ్యాప్త పోరాటంతో ప్రభుత్వం ఒత్తిడిని ఎదుర్కొంటోంది.

Check Also

డ్రోన్లతో చిత్రీకరించారనడం అవాస్తవం

Share this on WhatsAppగుంటూరు: గత ఐదేళ్లలో తెదేపా అవినీతి బాగోతాలు బయటకు వస్తున్నాయని హోంమంత్రి సుచరిత అన్నారు. ప్రజల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *