చెన్నై: విక్రవాండి, నాంగునేరి ఉప ఎన్నికల అనంతరం కొత్త విద్యుత్ కనెక్షన్ ఛార్జీలను పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. రాష్ట్ర విద్యుత్ బోర్డు గృహాలు, కర్మాగారాలు ఇతర అవసరాలకు విద్యుత్ కనెక్షన్‌కు ఛార్జీ వసూలు చేస్తుంది. గత నెల 25వ తేదీ ఈ ఛార్జీలను పెంపునకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ కూడా జరిగింది. ఈ విషయమై విద్యుత్ బోర్డు అధికారి మాట్లాడుతూ… కొత్త విద్యుత్ కనెక్షన్లకుగాను ఛార్జీలను పెంచేందుకు అవకాశాలు ఎక్కువగా వున్నాయని, ఈ నెల 21న జరగనున్న ఉప ఎన్నికల అనంతరం ఛార్జీలు పెంచే అవకాశముందని తెలిపారు.
