Breaking News
Home / National / అగ్ని శకలాలతో విద్యుత్తుకు అంతరాయం…..

అగ్ని శకలాలతో విద్యుత్తుకు అంతరాయం…..

అమెరికా: అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో మళ్లీ అగ్ని కీలలు వ్యాపించి అడవులు అంటుకుపోతున్న నేపథ్యంలో అక్కడ విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. భారీ స్థాయిలో అగ్ని కీలలు ఎగిసిపడే అవకాశం ఉన్న సందర్భంగా సుమారు 36 జిల్లాల్లో విద్యుత్తు సరఫరాను నిలిపివేస్తున్నట్లు పసిఫిక్ గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్ సంస్థ పేర్కొన్నది. ఇప్పటికే కార్చిచ్చు వల్ల సుమారు 50 వేల మంది ఇండ్లు విడిచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు. లాస్ ఏంజిల్స్‌తో పాటు సొనామా కౌంటీల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. చాలా భయానకమైన పరిస్థితి నెలకొన్నదని కాలిఫోర్నియా ఫైర్ డిపార్ట్‌మెంట్ ఓ ప్రకటన చేసింది.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *