Breaking News
Home / States / Andhra Pradesh / అనుకున్న సమయానికి ముందే విద్యుత్ ఉత్పత్తి లక్ష్యాన్ని పూర్తి ….పీవీ ఎల్. నరసింహారావు

అనుకున్న సమయానికి ముందే విద్యుత్ ఉత్పత్తి లక్ష్యాన్ని పూర్తి ….పీవీ ఎల్. నరసింహారావు

శ్రీశైలం టౌన్ : ఏపి జెన్ కో శ్రీశైలం కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను విద్యుత్ ఉత్పత్తి లక్ష్యాన్ని 5 నెలల ముందే పూర్తి చేసినట్లు చీఫ్ ఇంజినీర్ పీవిఎల్. నరసింహారావు తెలిపారు. గురువారం జెన్‌కో కార్యాలయంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది 850 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యానికి గాను ఇప్పటి వరకు 852.21 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేశామన్నారు. గత 4 సంవత్సరాలుగా ఇచ్చిన టార్గెట్ పూర్తి చేయలేక పోయారని, అప్పట్లో జలాశయానికి అనుకున్న రీతిలో నీటి ప్రవాహం రాలేదన్నారు. 2015-16లో 1234 మిలియన్ యూనిట్లకు గాను 207.7 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేశామన్నారు. అదే విధంగా 2016-17లో 1000.55 మిలియన్ యూనిట్లకు గాను 638.413, 2017-18లో 983 మిలియన్ యూనిట్లకు గాను 574, 2018-19లో 945 మిలియన్ యూనిట్లకు గాను 551.39 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేశామన్నారు. అయితే ప్రస్తుతం శ్రీశైల మల్లికార్జునస్వామి, భ్రమరాంబిక అమ్మవార్ల దయవల్ల జలాశయానికి ఊహించని విధంగా వరద ప్రవాహం రావడంతో విద్యుత్ ఉత్పత్తి ముమ్మురంగా చేపట్టామన్నారు. 150 టీఎంసీల నీటిని వినియోగించుకుని 850 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేపట్టామని, ఇంకా 150 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేపట్టే అవకాశం ఉందన్నారు. ఉద్యోగుల సమష్టి కృషి, సహకారంతో అనుకున్న విధంగా విద్యుత్ ఉత్పత్తి లక్ష్యాన్ని పూర్తి చేయటం చాల ఆనందంగా ఉందన్నారు. దీనిపై జెన్ కో ఎండీ సైతం సిబ్బందికి అభినందనలు తెలిపారన్నారు. అలాగే గత నెల 17న 1వ నెంబరు జనరేటర్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయిందన్నారు. మరమ్మతుల అనంతరం ఆ జనరేటర్‌ను వినియోగంలోకి తెచ్చామన్నారు. జనరేటర్ మరమ్మతులకు గాను చెన్నైకి చెందిన అభిరామి ఇంజినీరింగ్ కంపెనీకి రూ. 22 లక్షలు, హైదరాబాద్ శాంతి స్విచ్‌గేర్ కంపెనీకి రూ.10 లక్షలు చెల్లించామన్నారు.

 

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *