Breaking News
Home / States / Andhra Pradesh / విజయవాడలో పోక్సో ప్రత్యేక కోర్టు ప్రారంభం….

విజయవాడలో పోక్సో ప్రత్యేక కోర్టు ప్రారంభం….

విజయవాడ: విజయవాడ నగరంలోని సివిల్‌ కోర్టులో పోక్సో ప్రత్యేక న్యాయస్థానం ప్రారంభమైంది. ఈ ప్రత్యేక కోర్టును హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎనిమిది పోక్సో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేశామని, ఈ కోర్టులు బాలలకు స్నేహపూర్వకంగా ఉండాలని కోరారు. అనంతరం విజయవాడ సిటీ సివిల్‌ కోర్టులోని నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు, బెజవాడ బార్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *