Breaking News
Home / Film News / క్రేజీ కాంబినేషన్ తో ప్రభాస్

క్రేజీ కాంబినేషన్ తో ప్రభాస్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించి.. ఇటీవల విడుదలైన సాహో మూవీ కలెక్షన్లను రాబట్టిన కానీ హిట్ టాక్ మాత్రం తెచ్చుకోలేకపోయింది. బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ అభిమానుల భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ వారి అంచనాలను అందుకోలేకపోయింది. అప్పటి నుండి ఇప్పటివరకు రెబల్ స్టార్ ఏ సరికొత్త ప్రాజెక్టుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం లేదు .

అయితే లేటెస్ట్ గా ఇటీవల తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిన్న మూవీలుగా విడుదలైన ఘన విజయం సాధించిన కేజీఎఫ్ : ఛాప్టర్ 1 తో ఒక్క తెలుగు ఇండస్ట్రీనే కాకుండా మొత్తం ఇండియాలోనే సినిమా ప్రేక్షకులను ఆకట్టుకున్న కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రభాస్ కు కథ విన్పించినట్లు ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ప్రస్తుతం కేజీఎఫ్ సీక్వెల్లో బిజీబిజీగా ఉన్న ప్రశాంత్ ఆ తర్వాత మూవీ ప్రభాస్ తోనే తెరకెక్కించనున్నాడని ఫిల్మ్ నగర్లో గుసగుస. ఒకవేళ ఈ క్రేజీ కాంబినేషన్ పట్టాలెక్కితే మాత్రం టాలీవుడ్ లో సంచలనమే.

Check Also

బాలీవుడ్‌లో తీరని విషాదం.. ప్రముఖ కొరియోగ్రాఫర్ కన్నుమూత

Share this on WhatsAppబాలీవుడ్ లెజెండరీ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ (71) కన్నుమూశారు. గుండెపోటు కారణంగా శుక్రవారం ఉదయం ఆమె …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *