Breaking News
Home / National / పౌరసత్వ బిల్లుపై పార్టీతో విభేదించిన ప్రశాంత్‌ కిశోర్‌

పౌరసత్వ బిల్లుపై పార్టీతో విభేదించిన ప్రశాంత్‌ కిశోర్‌

పట్నా: పౌరసత్వ చట్ట సవరణ బిల్లుకు జేడీయూ మద్దతు పలకడంపై ఆ పార్టీ నేత, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. బిల్లు మతపరమైన విభేదాలు సృష్టించేదిగా ఉందని అభిప్రాయపడ్డారు. ”మత ఆధారంగా వివక్ష చూపే పౌరసత్వ బిల్లుకు జేడీయూ మద్దతు పలకడం నిరాశకు గురి చేసింది. పార్టీ రాజ్యాంగంలో మొదటి పేజీలోనే మూడుసార్లు ఉన్న లౌకిక విధానాలు, పార్టీ నాయకత్వం నిర్దేశించిన గాంధేయవాద ఆదర్శాలకు ఈ బిల్లు విరుద్ధంగా ఉంది” అని ఆయన ట్విటర్‌ వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అసోంలో ఎన్‌ఆర్‌సీ ప్రక్రియనూ ప్రశాంత్‌ గతంలో వ్యతిరేకించారు.

అఫ్గానిస్థాన్‌, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ నుంచి భారత్‌కు శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులకు పౌరసత్వం కల్పించాలన్న కీలక బిల్లుకు సోమవారం లోక్‌సభలో ఆమోదం లభించిన విషయం తెలిసిందే. ఏడు గంటల పాటు సుదీర్ఘంగా సాగిన చర్చ అనంతరం అనుకూలంగా 311మంది, వ్యతిరేకంగా 80మంది ఓటు వేయడంతో బిల్లుకు ఆమోదం లభించింది. అనుకూలంగా ఓటువేసిన వారిలో జేడీయూ కూడా ఉంది.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *