Breaking News
Home / Lifestyle / Recipes / రొయ్యల ఇగురు

రొయ్యల ఇగురు

రొయ్యల ఇగురు
కావలసినవి: ప్రాన్స్‌ – 500 గ్రా; ఉల్లితరుగు – రెండు కప్పులు ఏలకులు – ఆరు; దాల్చినచెక్క – కొద్దిగా; నూనె – కప్పు పచ్చిమిర్చి – ఆరు (పొడవుగా కట్‌ చేయాలి); కరివేపాకు – రెండు రెమ్మలు జీడిపప్పు  – 10 పలుకులు; కొత్తిమీర తరుగు – రెండు టీ స్పూన్లుపసుపు – చిటికెడు; గరంమసాలా – రెండు టీ స్పూన్లు గ్రేవీ కోసం:గసగసాలు – రెండు టీ స్పూన్లు; జీడిపప్పు – 10 పలుకులుపుచ్చపప్పు – రెండు టీ స్పూన్లు; కొబ్బరిముక్కలు – అర కప్పు వీటికి నీళ్లు కలిపి మెత్తగా గ్రైండ్‌ చేయాలి.

తయారి:
ముందుగా ప్రాన్స్‌ను శుభ్రంగా కడిగి వేడినీటిలో వేసి ఒక మోస్తరుగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి
స్టౌ మీద పాన్‌ పెట్టి నూనె పోసి వేడయ్యాక ఏలకులు, దాల్చినచెక్క, పచ్చిమిర్చి, ఉల్లితరుగు, పసుపు, అల్లంవెల్లుల్లి పేస్ట్‌ వేసి దోరగావేయించాలి
అందులో ఉడికించిన ప్రాన్స్, జీడిపప్పు, పావు కప్పు నీరు, గసగసాల మిశ్రమం, ఉప్పు వేసి కలిపి మూతపెట్టి తక్కువ సెగ మీద పది నిమిషాల సేపు ఉడికించాలి
ఇప్పుడు కరివేపాకు, కారం, గరంమసాలా వేసి కలిపిమిశ్రమం దగ్గరగా వచ్చే వరకు సన్న సెగ మీద ఉడికించాలి
ఇప్పుడు సర్వింగ్‌బౌల్‌లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్‌ చేయాలి.

Check Also

సజ్జలతో మంచూరియా

Share this on WhatsAppకావలసిన పదార్థాలు: సజ్జ పిండి – 150 గ్రా., మిర్చి – 10 గ్రా., కొత్తిమీర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *