Breaking News
Home / States / Andhra Pradesh / చిత్తూరులో విషాదం..

చిత్తూరులో విషాదం..

చిత్తూరు : జిల్లాలో దారుణం జరిగింది. భర్త, అత్తమామల వేధింపులు భరించలేక ఓ నిండు గర్భిణీ, ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకొంది. చిత్తూరు రూరల్ మండలంలోని పెయిన కండ్రికకు చెందిన గురునాథానికి 2012లో సరళతో వివాహమైంది. వారికి జోత్స్నా, దేవిశ్రీ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రస్తుతం సరళ ఆరు నెలల గర్భవతి. ఇద్దరు ఆడపిల్లలు పుట్టడం, ఇప్పుడు పుట్టబోయే శిశువు కూడా ఆడపిల్ల అని స్కానింగ్‌లో తెలియడంతో భర్త, అత్తమామలు సరళను కొద్దికాలంగా తీవ్రంగా వేధిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ వేధింపులు తాళలేక సరళ తెల్లవారుజామున పిల్లలతోపాటు గ్రామ సమీపంలోని బావిలో దూకి ఆత్మహత్య పాల్పడింది. దీంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. సరళ తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరవుతూ విలపిస్తున్నారు.

Check Also

గుండెపోటుతో అగ్రిగోల్డ్‌ ఏజెంట్‌ మృతి

Share this on WhatsAppకృష్ణా జిల్లా : జిల్లాలోని ఆగిరిపల్లి మండలం నరసింగపాలెంలో అగ్రిగోల్డ్‌ ఏజెంట్‌ మదపాటి జోజి కుమారి(35) …

2 comments

  1. Puttaboye pilla aadapilla ani ela telisindi? Scanning chesyinchina center vallani kooda arrest cheyali

  2. Ilanti vallaki non bailable cases book cheyali.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *