Breaking News
Home / States / సదర్‌ ఉత్సవాలకు సన్నాహాలు

సదర్‌ ఉత్సవాలకు సన్నాహాలు

హైదరాబాద్: దీపావళి సందర్భంగా నిర్వహించే సదర్‌ ఉత్సవాలకు యాదవ కులస్థులు సన్నద్ధమవుతున్నారు. సదర్ పండగ హైదరాబాద్ మహానగరంలో జరిగే ప్రధాన ఉత్సవాల్లో ఒకటి. దీపావళి పండుగను పురస్కరించుకొని హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో సదర్‌ పండుగను ఘనంగా నిర్వహిస్తారు. దీనిని దున్నపోతుల ఉత్సవంగా కూడా వ్యవహరిస్తారు. సదర్ అంటే హైదరాబాదీ వ్యవహారికం ప్రకారం ‘ప్రధానమైనది’ అని అర్థం. ఈ సందర్భంగా యాదవ సంఘాల ఆధ్వర్యంలో ఉత్సవాలను నిర్వహించి దున్నపోతులను ఊరేగించడం అనావాయితీ. ఇందులో భాగంగా వారం రోజులుగా దున్నపోతులకు తర్ఫీదును ఇవ్వడంతో పాటు సుందరంగా అలంకరించే పనిలో నిమగ్నమయ్యారు. ప్రధానంగా దున్నపోతులకు చర్మం మీద వెట్రుకలను తొలగించి చర్మానికి నూనె రాసి నిగనిగలాడేలా తయారు చేస్తారు.

హైదరాబాద్‌లో తప్ప సదర్ పండుగ దేశంలో మరే ఇతర ప్రాంతాల్లో జరగదు. తమ జీవనాధారమైన మేకలు, గొర్రెలు, ఆవులు, గేదెలను కూడా వేడుకలు జరిగే ప్రాంతాలకు తీసుకువస్తారు. నగరంలోని కాచిగూడ, నారాయణగూడ, ఖైరతాబాద్, సైదాబాద్, బోయిన్‌పల్లి, ఈస్ట్ ‌మారెడ్ పల్లి, చప్పల్ బజార్, పాతబస్తీ తదితర ప్రాంతాల్లో సదర్ ఉత్సవాలు జరుగుతాయి.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *