హైదరాబాద్: మంత్రి హరీశ్‌రావు మౌనం మంచిది కాదు, ప్రజాక్షేత్రంలోకి రావాలని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ అశ్వత్థామరెడ్డి డిమాండ్ చేశారు. తన ఆస్తులపై న్యాయ విచారణకు సిద్ధమని, అక్రమాస్తులు ఉన్నట్లు తేలితే బహిరంగ ఉరిశిక్షకు సిద్ధమని సవాల్ చేశారు. ఆర్టీసీని ప్రైవేటీకరిస్తామంటున్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు.. నోటితో నవ్వి నొసటితో వెక్కిరించినట్లు ఉన్నాయని విమర్శించారు. తాము చెప్పిన విషయాల్లో తప్పులుంటే ముక్కు నేలకు రాసి.. క్షమాపణలు చెప్పి రేపే విధుల్లో చేరుతామన్నారు. ఒకే వ్యక్తికి 44 పెట్రోల్ బంకులు ఇవ్వడంపై గవర్నర్ తమిళసై కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారని అశ్వత్థామరెడ్డి చెప్పారు.
