Breaking News
Home / States / Andhra Pradesh / కాకినాడలో లాక్‌డౌన్‌ అమలుకు సన్నద్ధం

కాకినాడలో లాక్‌డౌన్‌ అమలుకు సన్నద్ధం

కాకినాడ: కరోనా పాజిటివ్‌ కేసులు ఎక్కువగా పెరుగుతున్న దృష్ట్యా ఈ నెల 25 నుంచి కాకినాడలో సెమీ లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నామని సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి వెల్లడించారు. విలేకర్లతో ఆయన మాట్లాడుతూ జగన్నాథపురం ప్రాంతాన్ని పూర్తిగా రెడ్‌జోన్‌గా ప్రకటించామన్నారు. అక్కడ కేసుల నమోదు దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. నగరంలో 10 కరోనా టెస్టింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. నగరంలో సోమవారం ఒక రోజు 40 పొజిటివ్‌ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగించిందన్నారు. ఉదయం 6 నుంచి 11 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరిచి ఉంచాలన్నారు. జూమ్‌ యాప్‌ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంటున్నామని ద్వారంపూడి తెలిపారు.

Check Also

నరసరావుపేటలో రేపటి నుంచి సంపూర్ణ లాక్‌డౌన్

Share this on WhatsAppనరసరావుపేట: గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో శనివారం నుంచి సంపూర్ణ లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నట్లు ఆర్డీవో ఎం.వెంకటేశ్వర్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *