Breaking News
Home / Politics / కేంద్ర బీజేపీ నేతను కలిసిన ఎమ్మార్పిఎస్ అధ్యక్షుడు

కేంద్ర బీజేపీ నేతను కలిసిన ఎమ్మార్పిఎస్ అధ్యక్షుడు

హైదరాబాద్: బీజేపీ నేత, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని ఎమ్మార్పిఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కలిశారు. ఎస్సీవర్గీకరణను వేగవంతం చేయాలని ఈ సందర్బంగా కిషన్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పత్రికల్లో ఎక్కేందుకు కొందరు స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. వర్గీకరణ జరిగితేనే ఎస్సీ సామాజికవర్గం బలోపేతమవుతుందని అన్నారు. వర్గీకరణ వల్ల లాభాలను మాల సోదరులు గుర్తించారన్నారు. బీజేపీ ప్రభుత్వం ఈసారి ఎస్సీ వర్గీకరణ చేస్తుందనే నమ్ముతున్నామని, వెంకయ్యనాయుడు, కిషన్‌రెడ్డి ఎస్సీవర్గీకరణకు అనుకూలంగా ఉన్నారని మందకృష్ణ పేర్కొన్నారు.

Check Also

చిల్డ్రన్‌ ట్రాఫిక్‌ శిక్షణ పార్క్‌ ప్రారంభం…

Share this on WhatsAppనాగోలు: భారతదేశం అగ్రరాజ్యంగా ఎదిగేందుకు రోడ్డు భద్రత ముఖ్యభూమిక పోషిస్తుందని రాష్ట్ర అదనపు డీజీపీ జితేందర్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *