Breaking News
Home / States / Andhra Pradesh / కుప్పం ప్రెస్‌ క్లబ్‌ ఏపీయూడబ్ల్యూజే నిరసన….

కుప్పం ప్రెస్‌ క్లబ్‌ ఏపీయూడబ్ల్యూజే నిరసన….

తిరుపతి: ఆంధ్రజ్యోతి విలేకరి సత్యనారాయణను అతి కిరాతకంగా, దారుణంగా, విచక్షణా రహితంగా, మంగళవారం రాత్రి 7 గంటలకు అతని ఇంటి సమీపంలోని ఖాళీ స్థలంలో గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. ఈ దారుణ చర్యను నిరసిస్తూ కుప్పం ప్రెస్‌క్లబ్‌ (ఏపీయూడబ్ల్యూజే) ఆధ్వర్యంలో నాలుగు మండలాల విలేకరులు గురువారం నిరసన తెలిపారు. విలేకరులపై జరుగుతున్న ఇలాంటి ద్వేష పూరితమైన హత్యలను ఆపాలంటూ, విలేకరుల ఐక్యత వర్ధిల్లాలనే నినాదాలతో కుప్పం ఎమ్మార్వో, ఎంపీడీవో కార్యాలయం ఎదుట విలేకరులు ధర్నా చేపట్టారు. అనంతరం ఎమ్మార్వోకి వినతి పత్రాన్ని సమర్పించి విలేకరిని హత్య చేసిన కిరాతకులపై చర్యలు తీసుకోవాలని, విలేకరి కుటుంబానికి ఆర్థిక సాయం, ఉద్యోగం కల్పించాలని వారు విన్నవించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *